
Restaurant లో order చేయడం చాలా common situation.
మనలో చాలా మందికి ఇక్కడ ఎక్కువగా తడబాటు (hesitation) ఉంటుంది.
కానీ simple English + polite tone ఉంటే చాలు, చక్కగా ఆర్డర్ చేయొచ్చు. రెస్టారెంట్లో English లో ఎలా మాట్లాడాలి – ఇక్కడ తెలుసుకుందాం.
STEP 1 — Entering & Asking for Table
English: Table for two, please.
Telugu: ఇద్దరికి టేబుల్, please.
English: Table for four, please.
Telugu: నాలుగురికి టేబుల్, please.
English: Do you have a table near the window?
Telugu: విండో దగ్గర టేబుల్ ఉందా?
Tip:
Polite English = short + clear.
ఈ step లో grammar గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.
STEP 2 — Asking for the Menu
English: Can I see the menu?
Telugu: మెను ఇవ్వగలరా?
English: Do you have vegetarian options?
Telugu: వెజ్ ఆప్షన్స్ ఉన్నాయా?
English: What do you recommend today?
Telugu: ఇవాళ మీరు ఏవి రికమండ్ చేస్తారు?
Tip:
“Recommend” అనే పదం restaurant English లో చాలా useful.
STEP 3 — Ordering the Food
Format 1: I’ll (I will) have + Dish
English: I’ll (I will) have one Paneer Butter Masala.
Telugu: ఒక Paneer Butter Masala.
Format 2: Can I get + Dish
English: Can I get one Chicken Biryani?
Telugu: ఒక Chicken Biryani ఇవ్వండి.
Format 3: One + Dish + please
English: One Masala Dosa, please.
Telugu: ఒక మసాలా దోస, ప్లీజ్.
Tip:
“I’ll have…” అనేది confident.
“Can I get…” అనేది request tone.
STEP 4 — Asking About Details
English: Is it spicy?
Telugu: ఇది spicy గా ఉంటుందా ?
English: Is it sweet?
Telugu: ఇది తీపిగా ఉంటుందా ?
English: Is it vegetarian?
Telugu: ఇది వెజ్ ఆ?
English: What does it have?
Telugu: దీంట్లో ఏమి ఉంటుంది?
Tip:
Restaurants లో ఈ ప్రశ్నలు normal.
ఎవరూ judge చేయరు.
STEP 5 — Ordering Water & Drinks
English: Regular water, please.
Telugu: రెగ్యులర్ నీరు.
English: Do you have fresh juice?
Telugu: ఫ్రెష్ జ్యూస్ ఉందా?
English: One coffee / One tea / One lime soda.
Telugu: ఒక కాఫీ / ఒక టీ / ఒక లైమ్ సోడా.
Tip:
Water/Drinks ని ముందుగా order చేయడం helpful.
STEP 6 — Asking for Modifications
English: Less spicy, please.
Telugu: spicy తగ్గించండి.
English: No onions, please.
Telugu: ఉల్లిపాయలు వేయొద్దు.
English: Extra cheese, please.
Telugu: extra cheese వేయండి.
Tip:
Small modifications English లో చాలా simple.
STEP 7 — Asking for Time & Serving
English: How long will it take?
Telugu: ఎంత సమయం పడుతుంది?
English: Can you serve it hot?
Telugu: వేడిగా ఇవ్వగలరా?
English: Can you pack this? (Takeaway)
Telugu: దీన్ని pack చేయండి.
Tip:
Takeaway = parcel అని మాట్లాడినంతగా spoken English లో వాడరు.
STEP 8 — Complaints & Compliments
Compliment English:
English: It tastes really good!
Telugu: చాలా బాగా ఉంది!
English: This is delicious.
Telugu: ఇది చాలా tasty గా ఉంది.
Complaint English:
English: This is too spicy.
Telugu: ఇది చాలా spicy గా ఉంది.
English: This is too salty.
Telugu: ఇది చాలా ఉప్పుగా ఉంది.
Tip:
Complaints కూడా polite గా చెప్పాలి
STEP 9 — Asking for the Bill
English: Can I have the bill?
Telugu: బిల్ ఇవ్వండి.
English: Separate bill, please.
Telugu: బిల్ వేరుగా ఇవ్వండి, please.
English: We’ll (We will) pay together.
Telugu: మేము కలిపి చెల్లిస్తాం.
Tip:
Bill అంటారు – receipt కాదు.
STEP 10 — Useful Polite Words
please – దయచేసి
thank you – ధన్యవాదాలు
excuse me – ఎక్స్క్యూస్ మీ
could you…? – చేయగలరా?
may I…? – నేను చేయవచ్చా?
COMMON MISTAKES
✘ Long sentences
✘ Shyness
✘ Telugu-English mixing in the same line
✘ Avoiding eye contact
Correct approach =Short + Clear + Polite
ఈసారి రెస్టారెంట్‌కు వెళ్ళినప్పుడు ఈ English sentences ట్రై చేసి చూడండి.
మీ అనుభవం కామెంట్లో చెప్పండి.