ఆయిలీ స్కిన్ ఉన్నవారికి బెస్ట్ స్కిన్ కేర్ రొటీన్ – కంప్లీట్ గైడ్

ఆయిలీ స్కిన్ కోసం జెల్ మాయిశ్చరైజర్ ఉపయోగిస్తున్న మహిళ

మన చర్మంలో సహజంగా ఉండే నూనె గ్రంథులు (sebaceous glands) అవసరానికి మించి నూనె ఉత్పత్తి చేస్తే దాన్ని ఆయిలీ స్కిన్ అంటారు. ఇలాంటి స్కిన్ ఉన్నవాళ్ల ముఖం కొద్దిసేపట్లోనే మెరుస్తూ జిడ్డుగా కనిపిస్తుంది. పోర్స్ పెద్దగా కనిపించడం, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, మొటిమలు రావడం సాధారణం. హార్మోన్ల మార్పులు, వాతావరణం, తప్పు స్కిన్ కేర్ అలవాట్లు కూడా దీనికి కారణాలు. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి బెస్ట్  స్కిన్  కేర్  రొటీన్ ఈ గైడ్‌లో తెలుసుకోండి.

ఆయిలీ స్కిన్ తగ్గించడానికి ముఖ్యమైన చిట్కాలు

ఆయిలీ స్కిన్ను పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు, కానీ సరైన  రొటీన్ తో కంట్రోల్ చేయడం మాత్రం ఖచ్చితం.

  • రోజుకు రెండు సార్లు మాత్రమే ముఖం కడగాలి
  • బలమైన రసాయనాలు ఉన్నసబ్బులు మరియు ఆల్కహాల్ ఉన్న ప్రొడక్ట్స్ వాడకూడదు
  • మాయిశ్చరైజర్ అవసరం లేదని అనుకోవద్దు
  • రోజులో ఎక్కువ సార్లు ముఖం కడగడం ఆయిల్‌ను ఇంకా పెంచుతుంది
  • చేతులతో తరచూ ముఖాన్ని తాకే అలవాటు తగ్గించుకోవాలి

ఆయిలీ స్కిన్‌కు ఇంటి చిట్కాలు

ఇంటి దగ్గరే దొరికే పదార్థాలతో ఆయిలీ స్కిన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది.

  • ముల్తానీ మట్టి + రోజ్ వాటర్
    ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడగాలి. అదనపు ఆయిల్‌ను తీసేస్తుంది.
  • అలోవెరా జెల్
    రాత్రి పడుకునే ముందు పలుచగా అప్లై చేస్తే స్కిన్ కూల్ అవుతుంది, ఆయిల్ బ్యాలెన్స్ అవుతుంది.
  • టమాటో రసం
    కాటన్‌తో ముఖానికి అప్లై చేస్తే పోర్స్ చిన్నవిగా మారతాయి.

ఆయిలీ స్కిన్‌కు సరైన మాయిశ్చరైజర్

మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం, ఆయిలీ స్కిన్‌కు మాయిశ్చరైజర్ ఎందుకు అని.

ఆయిలీ స్కిన్ ఉన్నా కూడా చర్మానికి తేమ అవసరం.

జెల్ బేస్డ్, ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ వాడాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. మాయిశ్చరైజర్ వాడకపోతే చర్మం ఇంకా ఎక్కువ నూనె ఉత్పత్తి చేస్తుంది.

ఆయిలీ స్కిన్‌కు సన్‌స్క్రీన్ అవసరం

ఎండలో తిరిగే వాళ్లకు సన్‌స్క్రీన్ తప్పనిసరి.

  • SPF 30 లేదా అంతకంటే ఎక్కువ
  • మ్యాట్ ఫినిష్ ఉన్నది
  • చెమటతో కరిగిపోనిది

రోజూ ఉదయం బయటకు వెళ్లే ముందు తప్పకుండా అప్లై చేయాలి.

ఆయిలీ స్కిన్‌కు క్రీమ్స్ ఎలా ఉండాలి

లైట్ టెక్స్చర్ ఉన్న క్రీమ్స్ చర్మాన్ని సాఫ్ట్‌గా ఉంచి మొటిమలు రాకుండా చేస్తాయి. నూనె లేని జెల్ క్రీమ్స్‌నే ఎంచుకోవాలి.

ఆయిలీ స్కిన్‌ డే టైం   రొటీన్  (Day Time Routine)

  1. మైల్డ్ ఫేస్ వాష్ ఉపయోగించాలి
  2. ఆల్కహాల్ లేని టోనర్
  3. జెల్ మాయిశ్చరైజర్
  4. సన్‌స్క్రీన్

రొటీన్ రోజూ పాటిస్తే ముఖం రోజంతా జిడ్డు లేకుండా ఉంటుంది.

ఆయిలీ స్కిన్‌  నైట్ టైం   రొటీన్  ( Night Time Routine)

రాత్రి పూట స్కిన్ రిపేర్ అవుతుంది, కాబట్టి :

  1. ముఖం శుభ్రంగా కడగాలి
  2. టోనర్ అప్లై చేయాలి
  3. అలోవెరా జెల్ లేదా లైట్ నైట్ జెల్ అప్లై చేయాలి
  4. వారానికి రెండు సార్లు మట్టి ప్యాక్ ఉపయోగించాలి

ఆయిలీ స్కిన్‌కు ఇంట్లో చేసుకునే DIY ప్యాక్స్ 

ఇవి రెగ్యులర్‌గా వాడితే మంచి మార్పు కనిపిస్తుంది.

  • సెనగపిండి + పసుపు + పెరుగు
  •  10–15 నిమిషాలు
  • పూర్తిగా ఆరిపోయేలోపు గోరువెచ్చని నీటితో కడగాలి
  • వారానికి 2 సార్లు సరిపోతుంది

     డెడ్ స్కిన్ తొలగించి ఆయిల్ కంట్రోల్ చేస్తుంది.

  • ఓట్స్ పొడి + తేనె
  • 10 నిమిషాలు
  • మెల్లగా మసాజ్ చేస్తూ కడగాలి
  • డెడ్ స్కిన్ తొలగించడానికి మంచిది
    సున్నితమైన స్క్రబ్‌లా పనిచేస్తుంది.

 

  • రైస్ పౌడర్ + రోజ్ వాటర్
  •  10–12 నిమిషాలు
  • సున్నితంగా స్కిన్‌ను క్లీన్ చేస్తుంది
  • వారానికి ఒక్కసారి చాలు
    స్కిన్ టోన్ ఈవెన్ చేసి జిడ్డు తగ్గిస్తుంది.

 

  • ముల్తానీ మట్టి + అలోవెరా జెల్
  •  15 నిమిషాలు
  • పూర్తిగా ఆరిపోకముందే కడగాలి
  • ఎక్కువ సేపు ఉంచితే స్కిన్ డ్రై అవుతుంది
    మొటిమల సమస్య ఉన్నవాళ్లకు చాలా ఉపయోగం.

ఆయిలీ స్కిన్‌ తగ్గడానికి తినాల్సిన ఆహారం

స్కిన్ బయట కాదు, లోపల నుంచే మారాలి.

పండ్లు:

ఆపిల్, బొప్పాయి, దానిమ్మ, పుచ్చకాయ

కూరగాయలు:

కీరా, క్యారెట్, పాలకూర, టమాటో

జంక్ ఫుడ్, నూనె వంటలు, షుగర్ తగ్గిస్తే స్కిన్ తనకు తానే మెరుగు పడుతుంది.  

ఆయిలీ స్కిన్‌ ఉన్నవాళ్లు తాగాల్సిన పానీయాలు

స్కిన్ హెల్త్ కోసం పానీయాలు కూడా చాలా ముఖ్యం.

  • గోరువెచ్చని నీళ్లు
  • జీరా నీళ్లు
  • కొబ్బరి నీళ్లు
  • మజ్జిగ

రోజూ ఇవి తీసుకుంటే స్కిన్‌లోని టాక్సిన్స్ బయటకు వెళ్తాయి.

ఆయిలీ స్కిన్‌కు స్టీమ్ చేయాలా? ఎలా చేయాలి?

స్టీమ్ చేయడం ఆయిలీ స్కిన్‌కు మంచిదే కానీ సరైన విధానం పాటించాలి.

  • వారానికి ఒక్కసారి లేదా రెండు సార్లు మాత్రమే
  • 5–7 నిమిషాలకంటే ఎక్కువ చేయకూడదు
  • స్టీమ్ తర్వాత చల్లని నీటితో ముఖం కడగాలి
  • వెంటనే ముల్తానీ మట్టి (10–15 నిమిషాలు) లేదా అలోవెరా జెల్ (20–30 నిమిషాలు) అప్లై చేయాలి.

ఇలా చేస్తే పోర్స్ క్లీన్గా అవుతాయి, బ్లాక్‌హెడ్స్ తగ్గుతాయి, స్కిన్ కూల్ అవుతుంది.

స్టీమ్ తర్వాత ఆయిల్ కంట్రోల్ చేయడానికి ముల్తానీ మట్టి ప్యాక్ చాలా మంచిది.

ఆయిలీ స్కిన్‌కు మేకప్ వేసుకునే ముందు జాగ్రత్తలు

ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లు మేకప్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి.

  • ఆయిల్ ఫ్రీ ప్రైమర్ వాడాలి
  • క్రీమ్ ఫౌండేషన్ కంటే మ్యాట్ ఫౌండేషన్ మంచిది
  • మేకప్ అయిపోయిన తర్వాత బ్లాటింగ్ పేపర్ ఉపయోగించాలి
  • రోజంతా మేకప్‌తో ఉండకూడదు

ఇలా చేస్తే మొటిమల సమస్య తగ్గుతుంది.

ఆయిలీ స్కిన్‌కు ఉపయోగపడే చిన్న చిట్కాలు

  • మొబైల్ స్క్రీన్ రోజూ శుభ్రం చేయాలి
  • పిల్లో కవర్ వారానికి ఒకసారి మార్చాలి
  • మేకప్ వేసుకుని పడుకోకూడదు
  • రోజూ నీరు ఎక్కువగా తాగాలి

ఆయిలీ స్కిన్‌ ఉన్నవాళ్లు చేసే సాధారణ తప్పులు

చాలామంది తెలియకుండానే ఆయిలీ స్కిన్ సమస్యను ఇంకా పెంచే తప్పులు చేస్తారు.

  • మాయిశ్చరైజర్ వాడకపోవడం
  • రోజుకు 4–5 సార్లు ముఖం కడగడం
  • స్కిన్ టైప్‌కు సరిపోని క్రీమ్స్ వాడడం
  • హెవీ మేకప్‌ను రోజంతా ఉంచుకోవడం
  • రాత్రి స్కిన్ కేర్ స్కిప్ చేయడం

ఈ తప్పులు మానేస్తే స్కిన్‌లో సగం సమస్య తగ్గిపోతుంది.

ఆయిలీ స్కిన్‌ గురించి తరచూ అడిగే ప్రశ్నలు

ఆయిలీ స్కిన్‌కు ఫేస్ ప్యాక్ రోజూ వేయవచ్చా?

లేదు. వారానికి 2 సార్లు చాలు.

ఆయిలీ స్కిన్‌ వల్ల మొటిమలు తప్పనిసరిగా వస్తాయా?

కాదు. సరైన కేర్ ఉంటే మొటిమలు రావు.

ఆయిలీ స్కిన్‌  ఉన్నవాళ్లు ఆయిల్ వాడవచ్చా?

అవసరం లేదు. ఆయిల్ వాడితే మొటిమలు పెరిగే అవకాశం ఉంటుంది.

ముగింపు

ఆయిలీ స్కిన్‌ శాపం కాదు. సరైన క్లీనింగ్, లైట్ ప్రొడక్ట్స్, ఇంటి చిట్కాలు, మంచి ఆహారం కలిస్తే ఆయిలీ స్కిన్ కూడా ఆరోగ్యంగా, క్లియర్‌గా మారుతుంది. క్రమం తప్పకుండా ఈ స్కిన్ కేర్ రొటీన్ పాటిస్తే మంచి ఫలితాలు తప్పకుండా కనిపిస్తాయి.

గమనిక

ఈ వ్యాసంలో ఇచ్చిన ఆయిలీస్కిన్‌ కేర్ సూచనలు సాధారణ సమాచారం కోసం మాత్రమే. ప్రతి ఒక్కరి చర్మ స్వభావం వేరు కావచ్చు. ఏదైనా కొత్త హోమ్ రెమెడీ లేదా ప్రొడక్ట్ ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్(patch test) చేయడం మంచిది. తీవ్రమైన చర్మ సమస్యలు ఉన్నవారు చర్మ వైద్యుని సలహా తీసుకోవాలి.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top